MLA Lasya Nanditha | కారు ప్రమాదంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి-Namasthe Telangana

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) కన్నుమూశారు. ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు.


MLA Lasya Nanditha | కారు ప్రమాదంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి-Namasthe Telangana

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) కన్నుమూశారు. ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను దవాఖానకు తరలించారు. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.

సీనియర్‌ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కంటోన్మెంట్‌ సీటు ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిపై ఆమె విజయం  సాధించిన విషయం తెలిసిందే.

Lasya

ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో గాయడ్డారు. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

లాస్య నందిత.. 1987లో హైదరాబాద్‌లో జన్మించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేశారు. అనంతరం 2015లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదేఏడాది జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2016లో తన తండ్రి, అప్పటి ఎమ్మెల్యే సాయన్నతోపాటు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. తండ్రి మరణంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
ఎమ్మెల్యే లాస్య కుటుంబ సభ్యుల కు హరీష్ రావు పరామర్శ

https://www.youtube.com/watch?v=udtnd8e8ycM

 

Reference

Denial of responsibility! Samachar Central is an automatic aggregator of Global media. In each content, the hyperlink to the primary source is specified. All trademarks belong to their rightful owners, and all materials to their authors. For any complaint, please reach us at – [email protected]. We will take necessary action within 24 hours.
DMCA compliant image

Leave a Comment