GATE 2025కు ప్రిపేరయ్యే విద్యార్థులకు అలర్ట్.. అఫ్లికేషన్ డేట్ వాయిదా

ఉన్నత విద్య చదవాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహించే GATE (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) 2025 ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తు తేదీను వాయిదా వేసింది. నేటి(ఆగస్ట్ 24) నుంచి ప్రారంభకావాల్సిన గేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఆగస్ట్ 28 నుంచి ప్రారంభకానుంది. 2025 ఫిబ్రవరి 1, 2, 15, 15 తేదీల్లో జరిగే ఎగ్జామ్ ను ఐఐటీ రూర్కీ నిర్వహించనుంది. 

ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 26 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో కలిపి అక్టోబర్ 7 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2025 పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1800, మహిళా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.900.

AALSO READ | హెచ్‌‌‌‌‌‌‌‌ఏఎల్‌‌‌‌‌‌‌‌లో టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ పోస్టులు

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆర్డినేషన్ బోర్డ్ (ఎన్​సీబీ) గేట్ తరఫున ఐఐఎస్సీ (ఐఐఎస్​సీ), ఐఐటీ దిల్లీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తాయి. ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫైనల్ ఇయర్​లో ఉన్నవారు కూడా ఈ పరీక్షకు అర్హులు.

గేట్ 2025ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తారు. మొత్తం 30 టెస్ట్ పేపర్లు ఉంటాయి. పరీక్ష ఇంగ్లిష్​లో మాత్రమే ఉంటుంది. ఒక్కసారి గేట్ లో సాధించిన స్కోర్ మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. 

 

 

Reference

Denial of responsibility! Samachar Central is an automatic aggregator of Global media. In each content, the hyperlink to the primary source is specified. All trademarks belong to their rightful owners, and all materials to their authors. For any complaint, please reach us at – [email protected]. We will take necessary action within 24 hours.
DMCA compliant image

Leave a Comment