Rajat Patidar | ల‌క్కంటే మ‌నోడిదే.. వ‌న్డేల్లో అరంగ్రేటం రోజే 30 ల‌క్ష‌లు ప‌ట్టేశాడు-Namasthe Telangana

Rajat Patidar : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL) మొద‌ల‌య్యాక‌ భార‌త జ‌ట్టుకు ఆడాల‌నుకున్న కుర్రాళ్ల క‌లకు రెక్క‌లొచ్చిన‌ట్ట‌యింది. ఈమ‌ధ్య కాలంలో ఐపీఎల్‌లో చితక్కొడితే చాలు.. వికెట్ల వేట కొన‌సాగిస్తే చాలు ఒంటిమీదికి నీలి రంగు జెర్సీ వ‌చ్చి వాలుతోంది. ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) త‌ర‌ఫున నిల‌క‌డగా రాణించిన పాటిదార్..


Rajat Patidar | ల‌క్కంటే మ‌నోడిదే.. వ‌న్డేల్లో అరంగ్రేటం రోజే 30 ల‌క్ష‌లు ప‌ట్టేశాడు-Namasthe Telangana

Rajat Patidar : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL) మొద‌ల‌య్యాక‌ భార‌త జ‌ట్టుకు ఆడాల‌నుకున్న కుర్రాళ్ల క‌లకు రెక్క‌లొచ్చిన‌ట్ట‌యింది. ఈమ‌ధ్య కాలంలో ఐపీఎల్‌లో చితక్కొడితే చాలు.. వికెట్ల వేట కొన‌సాగిస్తే చాలు ఒంటిమీదికి నీలి రంగు జెర్సీ వ‌చ్చి వాలుతోంది. సూర్య‌కుమార్ యాద‌వ్(Surya Kumar Yadav), య‌శ‌స్వీ జైస్వాల్(Yashasvi Jaiswal), రింకూ సింగ్(Rinku Singh), తిల‌క్ వ‌ర్మ‌(Tilak Verma).. వీళ్లంతా అలా జ‌ట్టులోకి వ‌చ్చిన‌వాళ్లే. తాజాగా ఈ లిస్ట్‌లో ర‌జ‌త్ పాటిదార్(Rajat Patidar ) చేరిపోయాడు.

ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) త‌ర‌ఫున నిల‌క‌డగా రాణించిన పాటిదార్.. ద‌క్షిణాఫ్రికాపై వ‌న్డేల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్న ఈ రైట్ హ్యాండ‌ర్ మ‌రో జాక్‌పాట్ కొట్టాడు. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో అమాంతం రూ. 30 ల‌క్షలు అద‌నంగా ఆర్జించ‌నున్నాడు. అవును.. 17వ సీజ‌న్‌లో ఆర్సీబీ యాజ‌మాన్యం పాటిదార్‌కు రూ.50లు ముట్టజెప్ప‌నుంది. ఎందుకో తెలుసా..?

Patidar F

ఐపీఎల్ సీజ‌న్ల మ‌ధ్య‌లో భార‌త జ‌ట్టుకు ఆడిన క్రికెట‌ర్ల‌కు క‌నీసం రూ.50 లక్ష‌లు ఇవ్వాల‌ని బీసీసీఐ(BCCI) నియ‌మం పెట్టింది. అందులో భాగంగానే పాటిదార్‌కు 17వ సీజ‌న్‌తో అర‌కోటి అందుకోనున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ పాటిదార్‌కు ఆర్సీబీ రూ.20 ల‌క్ష‌లు ఇస్తూ వ‌స్తోంది. బీసీసీఐ నిబంధ‌న‌తో ‘క్యాప్డ్ ప్లేయ‌ర్'(Capped Player) అయిన ఈ స్టార్ బ్యాట‌ర్‌కు బెంగ‌ళూరు 17వ సీజ‌న్‌లో మ‌రో రూ.30 ల‌క్ష‌లు క‌లిపి మొత్తంగా రూ.50 లక్ష‌లు ఇవ్వ‌నుంది.

Patidar F

ఐపీఎల్ 16వ ఎడిష‌న్‌లో పాటిదార్ క్వాలిఫ‌య‌ర్ 1లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ బాదాడు. ఈ సీజ‌న్‌లో 8 మ్యాచుల్లో అత‌డు 55.50 స‌గుటుతో 333 ర‌న్స్ కొట్టాడు. అయితే.. 16వ సీజ‌న్‌కు ముందు గాయప‌డిన పాటిదార్ టోర్నీ మొత్తానికి దూర‌మ‌య్యాడు. ఈ మ‌ధ్యే గాయం నుంచి కోలుకున్న పాటిదార్ ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌కు ఎంపిక‌య్యాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్ మినీ వేలం డిసెంబ‌ర్ 19న‌ ముగిసిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే టోర్నీ ఆరంభం తేదీ, మ్యాచ్‌ల వివరాల‌తో కూడిన‌ షెడ్యూల్ రానుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

 

Next article

 

Reference

Denial of responsibility! Samachar Central is an automatic aggregator of Global media. In each content, the hyperlink to the primary source is specified. All trademarks belong to their rightful owners, and all materials to their authors. For any complaint, please reach us at – [email protected]. We will take necessary action within 24 hours.
DMCA compliant image

Leave a Comment