Sbi Share Price,SBI MCap: కాసుల పంట పండిస్తున్న ఎస్‌బీఐ.. ఒక్కరోజే 10 శాతం పెరిగిన షేరు.. ఏకంగా రూ. 8 లక్షల కోట్లతో మరో ఘనత! – sbi surges to become seventh company with rs 8 lakh crore market capitalisation, stock hits 10 percent upper circuit

SBI Market Capitalisation: భారత స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార NDA ప్రభుత్వానికే పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో సూచీలు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా 2350 పాయింట్లకుపైగా పెరగ్గా.. 76 వేల 300 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇంట్రాడేలో 2700 పాయింట్లకుపైగా కూడా పెరగడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 700 పాయింట్లకుపైగా లాభంతో 23 వేల 230 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా మోదీ స్టాక్స్‌గా పేరుగాంచిన ప్రభుత్వ రంగాల స్టాక్స్ భారీగా దూసుకెళ్తున్నాయి.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ ఇవాళ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. ఈ వార్త రాసే సమయంలో 9 శాతానికిపైగా లాభంతో ప్రస్తుతం రూ. 905.65 వద్ద ఉంది. ఇక ఇంట్రాడేలో 10 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 912 వద్ద జీవన కాల గరిష్టాల్ని నమోదు చేసింది. దీంతో ఎస్‌బీఐ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి అదిరిపోయే రిటర్న్స్ వచ్చాయని చెప్పొచ్చు.

ఇక ఎస్‌బీఐ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 8.09 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఘనత సాధించిన ఏడో భారత లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. అంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఎం- క్యాప్ రూ. 8 లక్షల కోట్లు దాటాయి. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా ఈ లిస్టులో చేరింది.

ఎస్‌బీఐ స్టాక్ ఒక్కరోజులో ఇంత శాతం పెరగడం 2021, సెప్టెంబర్ తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఎస్‌బీఐ షేరు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 41 శాతానికిపైగా పెరగడం విశేషం. గత కొద్ది రోజులుగా ఈ స్టాక్ పరుగులు పెడుతూనే ఉంది. గత 5 రోజుల్లో చూస్తే 7.87 శాతం పెరగ్గా.. నెల రోజుల్లో 8 శాతానికిపైగా పుంజుకుంది. 6 నెలల్లో 52 శాతం పెరిగింది. అంటే లక్ష పెట్టుబడిని 6 నెలల్లోనే రూ. రూ. 1.50 లక్షలు చేసిందని చెప్పొచ్చు. ఇక ఏడాది వ్యవధిలో కూడా 55 శాతం పెరిగింది. ఐదేళ్ల వ్యవధిలో గరిష్టంగా 165 శాతం ఈ స్టాక్ పెరిగింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ ప్రస్తుతం ఉన్న రూ. 912 కాగా.. కనిష్ట విలువ రూ. 543.20.

 

Reference

Denial of responsibility! Samachar Central is an automatic aggregator of Global media. In each content, the hyperlink to the primary source is specified. All trademarks belong to their rightful owners, and all materials to their authors. For any complaint, please reach us at – [email protected]. We will take necessary action within 24 hours.
DMCA compliant image

Leave a Comment