Sbi Share Price,SBI MCap: కాసుల పంట పండిస్తున్న ఎస్బీఐ.. ఒక్కరోజే 10 శాతం పెరిగిన షేరు.. ఏకంగా రూ. 8 లక్షల కోట్లతో మరో ఘనత! – sbi surges to become seventh company with rs 8 lakh crore market capitalisation, stock hits 10 percent upper circuit
SBI Market Capitalisation: భారత స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార NDA ప్రభుత్వానికే పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో సూచీలు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా 2350 పాయింట్లకుపైగా పెరగ్గా.. 76 వేల 300 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇంట్రాడేలో 2700 పాయింట్లకుపైగా కూడా పెరగడం గమనార్హం. …