Jasprit Bumrah: ఇలాంటి పిచ్‌లపై ఆడాలంటే… ఇంకా చురుగ్గా ఉండాల్సిందే: జస్ప్రీత్ బుమ్రా
కొత్తగా తయారు చేసిన పిచ్‌ను త్వరగా అర్థం చేసుకుంటేనే మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవకాశం ఉంటుందని భారత పేసర్ బుమ్రా వ్యాఖ్యానించాడు. ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ మైదానం పిచ్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ భారత పేస్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్ పరిస్థితులను ఎంత త్వరగా అర్థం చేసుకుంటే… అంత మంచిదని పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా మూడు ఓవర్లలో కేవలం 6 పరుగులను మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను …