Vivo V30-V30 Pro | త్వరలో భారత్ మార్కెట్లోకి వివో వీ30 అండ్ వివో వీ30 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!-Namasthe Telangana

Vivo V30-V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వీ30 (Vivo V30), వివో వీ30 (Vivo V30 Pro) ఫోన్లను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది.


Vivo V30-V30 Pro | త్వరలో భారత్ మార్కెట్లోకి వివో వీ30 అండ్ వివో వీ30 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!-Namasthe Telangana

Vivo V30-V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వీ30 (Vivo V30), వివో వీ30 (Vivo V30 Pro) ఫోన్లను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది. భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్న వివో వీ30 సిరీస్ ఫోన్లు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, పికాక్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో వీ30 ప్రో సిరీస్ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. వివో వీ30 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.

వివో వీ30 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్స్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతోపాటు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. గతేడాది డిసెంబర్‌లో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన వివో ఎస్18 ప్రో ఫోన్ రీ బ్రాండెడ్ వర్షన్‌గా వివో వీ30 ప్రో వస్తున్నది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 + ఎస్వోసీ చిప్‌సెట్ కలిగి ఉంటుందని తెలుస్తున్నది.

 

Reference

Denial of responsibility! Samachar Central is an automatic aggregator of Global media. In each content, the hyperlink to the primary source is specified. All trademarks belong to their rightful owners, and all materials to their authors. For any complaint, please reach us at – [email protected]. We will take necessary action within 24 hours.
DMCA compliant image

Leave a Comment