‘రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు – కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీ అలా ఉంటుంది’ – కేఎల్ రాహుల్​

LSG Captain KL Rahul : ప్రస్తుతం టీమ్‌ ఇండియా స్టార్‌ ప్లేయర్స్‌లో కేఎల్‌ రాహుల్‌ ఒకడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌, ఐపీఎల్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌(LSG) టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడు తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడాడు. తన కెప్టెన్సీ, ఇండియన్‌ టీమ్‌ ప్లేయర్స్‌ గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నాడు.

  • నమ్మింది చేస్తేనే సక్సెస్‌
    రాహుల్ తన కెప్టెన్సీ విజయాలపై మాట్లాడుతూ – “నేను నా గట్‌ ఫీలింగ్‌ను నమ్మి, నాకు అనిపించింది చేస్తుండటంతోనే సక్సెస్‌ అయ్యాను. ప్రారంభంలో నా ఆ లోచనలు, టీమ్ మేనేజ్‌మెంట్ సలహాల మధ్య ఎటూ తేల్చుకోలేకపోయే వాడిని అని చెప్పాడు. టీమ్‌ బిల్డ్ చేయడమంటే వేలంలో కొత్త ప్లేయర్స్‌ను కొనడం కాదు కీలక ప్లేయర్స్​ను కోల్పోకుండా ఉండట”మని అభిప్రాయపడ్డాడు.

“కెప్టెన్‌గా చాలా సమాచారం అందుతుంది. ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదో కూడా తెలిసి ఉండాలి. కొన్ని సార్లు కోచ్‌లు చెప్పేదానికి విరుద్ధంగా మన గట్ ఫీలింగ్‌ ఉంటుంది. మొదట్లో, పెద్ద వాళ్లకు విరుద్ధంగా వెళ్లడం కష్టమైంది. ప్లాన్స్‌ వర్కౌట్‌ అయ్యేవి కావు, నాకు రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు. నమ్మకం, బాండింగ్​ ప్లేయర్‌లతోనే కాదు కోచ్‌తో కూడా బిల్డ్‌ చేసుకోవాలని గ్రహించాను. కెప్టెన్‌కు, కోచ్‌కు ఒకటే కావాలి.” అని వివరించాడు. కాగా, రాహుల్​ ప్రస్తుతం లఖ్‌నవూ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి పనిచేస్తున్నాడు. గతంలో అనిల్ కుంబ్లే, ఆండీ ఫ్లవర్‌లతోనూ కలిసి పని చేసిన అనుభవం ఉంది.

  • రోహిత్‌, కోహ్లి కెప్టెన్సీ ఎలా ఉంటుంది?
    భారత్‌ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై అడిగిన ప్రశ్నకు రాహుల్‌ సమాధానమిస్తూ – “రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రశాంతతను తీసుకువచ్చాడు. ప్యాషన్‌ అలాగే ఉంటుంది. ప్లేయర్స్‌కు తమ రోల్స్‌ అర్థం చేసుకోవడానికి, అడ్జస్ట్‌ కావడానికి అవకాశం ఉంటుంది. ఫీల్డ్‌లో ఎలా ఉండాలనే దానిపై విరాట్ ఇప్పటికే బెంచ్‌మార్క్‌ సెట్ చేశాడు. రోహిత్ కాస్త ప్రశాంతంగా ఉంటాడు.” అని పేర్కొన్నాజు. అలానే క్రికెట్‌లో ఎంఎస్‌ ధోనీ, కేన్ విలియమ్సన్‌ను ట్రూ జెంటిల్‌మెన్స్‌గా పేర్కొన్నాడు.

ఇకపోతే కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. ఈ జట్టుకు కెప్టెన్‌ అయ్యాక మొదటి రెండు సీజన్‌లలో LSG, ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈ సీజన్‌లో కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. అయితే LSGకు రాక ముందు, రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కూడా రెండు సీజన్‌లు సారథ్యం వహించాడు. కానీ ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్‌కు ఆఫ్స్‌కు తీసుకెళ్లలేకపోయాడు. ఇక రాహుల్‌కు టీమ్‌ ఇండియాకి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది.

ఐపీఎల్​లో ఆ రూల్​ నాకు నచ్చలేదు – దాని వల్ల నష్టం : రోహిత్ శర్మ – IPL 2024 Rohith Sharma

‘పాకిస్థాన్​తో టెస్ట్ క్రికెట్​కు రెడీ – వాళ్ల లైనప్ బాగుంటుంది’ – India Vs Pakistan Test cricket

 

Reference

Denial of responsibility! Samachar Central is an automatic aggregator of Global media. In each content, the hyperlink to the primary source is specified. All trademarks belong to their rightful owners, and all materials to their authors. For any complaint, please reach us at – [email protected]. We will take necessary action within 24 hours.
DMCA compliant image

Leave a Comment